దక్షిణ భారత రాజ వంశాలు - 1
South Indian History
1. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) పుష్యభూతి వంశ పాలకుల్లో అగ్రగణ్యుడు-హర్షుడు
బి) పుష్యభూతి వంశ రాజధానులు- స్థానేశ్వరం, కనోజ్
సి) హర్షుడి సామ్రాజ్యాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు- హుయాన్‌త్సాంగ్
డి) పైవన్నీ
2. కింది వాటిలో హర్షుడు రచించిన గ్రంథం ఏది?
ఎ) నాగానందం
బి) ప్రియదర్శిక
సి) రత్నావళి
డి) పైవన్నీ
3. అలంపూర్‌లో నవబ్రహ్మేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు?
ఎ) బాదామి చాళుక్యులు
బి) చోళులు
సి) పల్లవులు
డి) రాజపుత్రులు
4. హర్షుణ్ని ఓడించిన ప్రముఖ దక్షిణ భారత పాలకుడు ఎవరు?
ఎ) నరసింహ వర్మ
బి) రెండో పులకేశి
సి) రెండో కీర్తివర్మ
డి) కుబ్జ విష్ణువర్ధన
5. హర్షుడు ఏ ప్రాంతంలో ఐదేళ్లకోసారి మహామోక్ష పరిషత్ నిర్వహించి దానధర్మాలు చేసేవాడు?
ఎ) కాశీ
బి) గయ
సి) ప్రయాగ
డి) కనోజ్
6. కింది వాటిలో హర్షుడి ఆస్థానకవి ‘బాణుడు’ రచించిన గ్రంథం ఏది?
ఎ) హర్ష చరిత్ర
బి) కాదంబరి
సి) చండీ శతకం
డి) పైవన్న
7. హర్షుడు, రెండో పులకేశి ఏ నదిని వారి రాజ్యాలకు సరిహద్దుగా నిర్ణయించారు?
ఎ) నర్మద
బి) తపతి
సి) కృష్ణా
డి) పెన్నా
8. రెండో పులకేశి విజయాల గురించి తెలిపే ‘ఐహోలు’ శాసనకర్త ఎవరు?
ఎ) రవికీర్తి
బి) మంగలేశుడు
సి) హరిసేనుడు
డి) ధనుంజయుడు
9. రెండో పులకేశిని మణిమంగళ యుద్ధంలో ఓడించి, తర్వాత వధించిన పల్లవ రాజు ఎవరు?
ఎ) మహేంద్ర వర్మ
బి) మొదటి నరసింహ వర్మ
సి) రెండో నరసింహ వర్మ
డి) హస్తి వర్మ
10.బాదామి చాళుక్య పాలనను అంతం చేసి స్వతంత్ర పాలన ఏర్పాటు చేసినవారు?
ఎ) రాష్ట్రకూటులు
బి) కల్యాణి చాళుక్యులు
సి) వేంగీ చాళుక్యులు
డి) చోళులు
11. బాదామి చాళుక్యుల కాలంలో ‘సర్పకరి పరిహారం’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
ఎ) పన్ను పెంపు
బి) భూమి శిస్తు
సి) పన్ను మినహాయింపు
డి) న్యాయ విధానం
12. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) బాదామి చాళుక్యుల వాస్తు నిర్మాణ శైలి-వేసర శైలి
బి) పల్లవుల వాస్తు నిర్మాణ శైలి-ద్రవిడ శైలి
సి) ఎ, బి
డి) పైవేవీకావు
13.‘మత్తవిలాస ప్రహసనం’ గ్రంథంలో జైన, బౌద్ధ, శైవ శాఖలను వ్యంగ్యంగా విమర్శించిన పల్లవరాజు ఎవరు?
ఎ) మహేంద్ర వర్మ
బి) నరసింహ వర్మ
సి) జయసింహ
డి) పరమేశ్వర వర్మ
14.ప్రముఖ కవులు, వారిని పోషించిన పల్లవరాజులకు సంబంధించి కిందివాటిలో సరైన జత ఏది?
ఎ) భారవి - మొదటి నరసింహ వర్మ
బి) దండి - రెండో నరసింహ వర్మ
సి) పెరందేవర - మూడో నంది వర్మ
డి) పైవన్నీ
15. కవులు, వారు రచించిన గ్రంథాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
1) భారవి ఎ)కిరాతార్జునీయం
2) దండి బి) దశకుమార చరిత్ర
3) పెరుందేవర సి) తమిళ మహాభారతం
4) బిల్హణుడు డి) విక్రమాంకదేవ చరిత్ర
5) మహేంద్రవర్మ ఇ) భగవదజ్జుక, పరివాదిని
1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
16. రెండో నరసింహ వర్మకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) కంచిలో ప్రఖ్యాత కైలాసనాథ ఆలయాన్ని నిర్మించాడు
బి) ‘రాజసింహ’ అనే బిరుదుతో ప్రఖ్యాతి వహించాడు
సి) మామల్లపురంలో తీరదేవాలయాన్ని నిర్మించాడు
డి) పైవన్నీ
17. పల్లవుల్లో సుదీర్ఘకాలం (65 ఏళ్లు) పాలించిన రాజు ఎవరు?
ఎ) పరమేశ్వర వర్మ
బి) మొదటి నంది వర్మ
సి) రెండో నంది వర్మ
డి) మహేంద్ర వర్మ
18. మహాబలిపురంలో ప్రపంచ ప్రఖ్యాత పంచ పాండవ రథాలను నిర్మించిన రాజవంశం ఏది?
ఎ) పల్లవులు
బి) రాష్ట్రకూటులు
సి) చోళులు
డి) చాళుక్యులు
19. పల్లవుల కాలంలో ‘ఘటికలు’ అంటే?
ఎ) గ్రామసభలు
బి) దేవాలయాలు
సి) సంస్కృత విద్యాలయాలు
డి) న్యాయ సభలు
20. రాజవంశాలు, వాటి మూల పురుషులకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
1) ప్రాచీన పల్లవులు ఎ) సింహ వర్మ
2) నవీన పల్లవులు బి) సింహ విష్ణు
3) రాష్ట్రకూటులు సి) దంతిదుర్గుడు
4) బాదామి చాళుక్యులు డి) జయసింహ
5) చోళులు ఇ) విజయాళయ
1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
21.హుయాన్‌త్సాంగ్ సందర్శించిన రాజ్యాలు, వాటి రాజులకు సంబంధించి కింది వాటిలో సరైన జత?
ఎ) బాదామి చాళుక్య - రెండో పులకేశి
బి) పల్లవ - మొదటి నరసింహ వర్మ
సి) వేంగి చాళుక్య - కుబ్జ విష్ణువర్ధన
డి) పైవన్నీ
22. దక్షిణ భారత వాస్తురీతికి జన్మస్థానంగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది?
ఎ) మహాబలిపురం
బి) కంచి
సి) ఐహోల్
డి) తంజావూర్
23.‘సులేమాన్’ అనే అరబ్బు యాత్రికుడు ఎవరి పాలనా కాలంలో రాష్ట్రకూట రాజ్యాన్ని సందర్శించాడు? ఎ) ధ్రువుడు
ఎ) ధ్రువుడు
బి) దంతిదుర్గుడు
సి) అమోఘవర్షుడు
డి) నాలుగో ఇంద్ర
24. స్థానిక స్వపరిపాలనకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చిన రాజవంశం ఏది?
ఎ) చోళులు
బి) చాళుక్యులు
సి) రాజపుత్రులు
డి) రాష్ట్రకూటులు
25. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎల్లోరాలో కైలాస నాథ ఆలయాన్ని నిర్మించిన రాష్ట్ర కూట రాజు ఎవరు? ఎ) మొదటి కృష్ణుడు
ఎ) మొదటి కృష్ణుడు
బి) మొదటి గోవిందుడు
సి) దంతిదుర్గుడు
డి) మూడో గోవిందుడు
You got {number correct}/{number of questions} correct answers
Thank You....!!!